AP లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్టలు విప్పేందుకు పూర్తిగా స‌హ‌క‌రిస్తా – విజ‌యసాయి ట్విట్

విజ‌య‌వాడ – ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ సంచలనంగా మారింది.. ఇప్పటికే సిట్‌ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కీలక సమాచారాన్ని సిట్‌ అధికారులకు చెప్పారు.. ఇక, రంగంలోకి దిగిన సిట్ ఈ కేసులో కీలకంగా భావిస్తోన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్‌ చేసింది.. ప్ర‌స్తుతం క‌సిరెడ్డిని విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యంలో విచారిస్తున్నారు.. నేడు క‌సిరెడ్డిని అధికారులు కోర్టులో కూడా హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

కాగా, ఈ లిక్కర్‌ స్కామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ”ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను” అంటూ ట్వీట్‌ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కాగా, సిట్‌ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి రాజ్‌ కసిరెడ్డే నంటూ వ్యాఖ్యానించారు.. మరోవైపు.. రాజ్‌ కసిరెడ్డి విడుదల చేసిన ఆడియోలో సాయిరెడ్డిపై మండిపడ్డారు.. లిక్కర్‌ కేసు వ్యవహారం తేలిన తర్వాత.. విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ వ్యాఖ్యానించారు రాజ్‌ కసిరెడ్డి.. ఈ నేపథ్యంలో.. ట్వీట్‌తో మరింత రచ్చకు తెరలేపారు విజయసాయిరెడ్డి..

Leave a Reply