న్యూ ధర్మాజిపేట్‌లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
న్యూ ధర్మాజిపేట్‌లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చొరవతో బోర్‌వెల్ ఏర్పాటు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం న్యూ ధర్మాజిపేట్ గ్రామంలో తీవ్ర తాగునీటి కొరత నెలకొనడంతో గ్రామ సర్పంచ్ సుమలత ఈ సమస్యను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు బోర్‌వెల్ ఏర్పాటు చేయించారు.
బోర్‌వెల్ ఏర్పాటు కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపుతున్న చొరవ అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్, రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, కడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, నాయకులు దుర్గం రాజేష్, ధర్మయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
