అనంతగిరిలో వైభవంగా అధికమాస కృష్ణ యజ్ఞం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధికమాస యజ్ఞాల్లో భాగంగా శనివారం కృష్ణ యజ్ఞాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికమాసంలో నిర్వహించే యజ్ఞాలు విశేష ఫలప్రదమని, భక్తులకు సర్వశుభాలను ప్రసాదిస్తాయని ఆలయ పురోహితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి, బీఆర్ఎస్ యువనేత కొప్పుల అనిల్ రెడ్డి, దోమ మండల మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
