ప్రజలు చలివేంద్రం సద్వినియోగం చేసుకోవాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న చలివేంద్రం ప్రజలు బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని పులిమామిడి సర్పంచ్ త్రివేణి చెన్నప్ప అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడిలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజల దహర్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలతో పాటు గ్రామస్తులకు ప్రభుత్వం నిర్వహించిన చలివేంద్రం వేసవిలో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పులిమామిడి గ్రామాభివృద్ధికి పాటుపడతాననిఅన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు మంజూరు చేసే విధంగా కృషి చేస్తాననిఅన్నారు. వేసవికాలంలో విద్యుత్ తాగునీటి ఎద్దడికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతాననిఅన్నారు. ఉపాధి హామీ కూలీలు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం వేళా పనులకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply