మంత్రి వివేక్‌పై విమర్శలు సరికావు

మంత్రి వివేక్‌పై విమర్శలు సరికావు
- బాల్క సుమన్‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై విమర్శలు చేయడానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఆదివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో సుమన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పాలనలో సుమన్ చెన్నూర్ నియోజకవర్గానికి గణనీయమైన అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేవలం కమిషన్ల రాజకీయాలతో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో నిరాశ చెంది పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీ సముద్రంలాంటిదని వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పాలన అందిస్తున్న మంత్రిపై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కాంగ్రెస్ నాయకులు సహించరని సుమన్‌కు సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాస్, నాయకులు పెద్దింటి శ్రీనివాస్, చెన్నూరి రాజేష్, శ్రీధర్, చెన్న సూర్యనారాయణ, సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
