నీటి ఎద్దడి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడి విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక కృషి చేస్తానని ఊట్కూర్ సర్పంచ్ ఎం రేణుక భరత్ అన్నారు. శనివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో నూతన పైప్ లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఊట్కూర్ పట్టణంలోని 16 వార్డుల్లో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరిస్తున్నామనిఅన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో శ్రీనివాస కాలనీ వాటర్ ట్యాంక్ నుండి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయా కాలనీలలో డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణంతోపాటు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఎంపీ డీకే అరుణ నిధులతో హైమాక్స్ లైట్లు సిసి రోడ్లు వేస్తున్నామనిఅన్నారు. పాలకవర్గం సభ్యుల సహకారంతో పట్టానాభివృద్ధికి కృషి చేస్తానని ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములుకావాలనిఅన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ముమ్మరంగా చేపడుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఊట్కూర్ మండల కేంద్రం రూపురేఖలుమార్చేందుకు కృషి చేస్తాననిఅన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తడి పొడి చెత్తవేరువేరుగాచెత్తా సేకరణవాహనంలో వేయాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీలు రాధాకృష్ణయ్యగౌడ్, భీమమ్మ ఆశప్ప, హన్మంతు, వార్డు సభ్యుడు అజయ్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి తారాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
