ఘంటసాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘంటసాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్యాంక్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, శ్రీకాకుళం డిసి అధ్యక్షులు అయినపూడి భాను ప్రకాష్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డిసి అధ్యక్షులు అయినపూడి భాను ప్రకాష్, ఘంటసాల పిఏసిఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, గొర్రెపాటి సురేష్, కాకుమాని రంగారావు, పరిసే చలపతి, తుమ్మల నందేశ్వరరావు, కంఠమనేని రాజ గోపాల్, పాటిబండ్ల నరేశ్, పొట్లూరి యోహాను, దోనేపూడి శ్రీను, రమేష్, దిరిశం సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
