వేళ్ళమ్మ తల్లి జాతర ఉత్సవాలకు శ్రీకారం

రామచంద్రాపురం–అవనిగడ్డ, ఆంధ్రప్రభ: అవనిగడ్డ మండలం రామచంద్రాపురంలో గ్రామదేవత శ్రీ వేళ్ళమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కార్యక్రమంలో టీడీపీ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మిలి రమేష్, కమ్మిలి బాబూరావు, మత్తి మావూరి కృష్ణయ్య, మాజీ వార్డు సభ్యులు కమ్మిలి సాయి భార్గవ, టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షులు బచ్చు పున్నయ్య, సనకా రమేష్, కమ్మిలి వెంకటేశ్వరరావు, కమ్మిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.