ORPHANAGE | దైవంతో సమానం తల్లిదండ్రులే

ORPHANAGE | దైవంతో సమానం తల్లిదండ్రులే

ORPHANAGE |తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : కన్న తల్లిదండ్రులను బ్రతికున్నప్పుడే అనాధాశ్రమంలో చేర్పిస్తున్న కుమారులు ఉన్న ఈ రోజుల్లో, తల్లిదండ్రులే దైవంగా భావించి బ్రతికున్నన్ని రోజులు సేవలు చేసి స్వర్గస్తులైన తర్వాత నిత్యం పూజిస్తున్న కుమారులు ఉన్నారు. తాడువాయి మండలం చిట్యాల గ్రామంలో స్వర్గీయ అంబీర్ ఇందిరా బాయ్ శ్రీహరి రావు (Amber Indira Bhai Srihari Rao) కొంతకాలం క్రితం స్వర్గస్తులు కాగా, వారికి జ్ఞాపకార్ధంగా సొంత వ్యవసాయ భూమిలో విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్యం నిత్యం పూజలు చేస్తున్న అంబీర్ నరేందర్ రావు ,మనోహర్ రావు ,భువనేశ్వర్ రావు, ముగ్గురు కుమారులు మాట్లాడుతూ మా తల్లిదండ్రులు మాకు ప్రేమాను రాగాలు పంచి, పెంచి పెద్ద చేసి , ఉన్నతమైన స్థానాలను నిలబెట్టారని, ఇలాంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు గర్వంగా దైవ సమానంగా భావిస్తున్నామని తెలిపారు.

తల్లిదండ్రులకు సేవలు చేయడం (Serving Parents) పూర్వజన్మ సుకృతమని అన్నారు. మునుముందు యువతరం తల్లిదండ్రులకు సేవలు చేసి , తల్లిదండ్రులను దైవంగా భావించాలని వారు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ గురూజీ, ఆలయ పూజారి శివ పంతులు, గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply