Ootkur | ఎంపీ నిధులతో గ్రామ అభివృద్ధికి కృషి
Ootkur | ఎంపీ నిధులతో గ్రామ అభివృద్ధికి కృషి
- బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎం.రేణుక భరత్
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ బలపర్చిన ఊట్కూర్ సర్పంచ్ అభ్యర్థి ఏం.రేణుక భరత్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్ అన్నారు. ఆదివారం ఊట్కూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి రహిత పాలనే బీజేపీ లక్ష్యమని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించామని గ్రామ రూపురేఖలు మార్చే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఊట్కూర్ అభివృద్ధికి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక కృషి చేస్తున్నారని, అధిక నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని, ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో సర్పంచుగా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతోపాటు స్వచ్ఛమైన తాగునీరు విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో బిజెపినాయకులు కృష్ణయ్య గౌడ్, ఎం. విజయ్ కుమార్, కొండన్ గోపాల్, రమేష్, హన్మంతు, కుర్వ ఆశప్ప, లక్ష్మణ్, భరత్, రమేష్, రణవీర్, తదితరులు పాల్గొన్నారు.
