Accident | తిరగబడ్డ లారీ..

Accident | తిరగబడ్డ లారీ..
Accident, ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని నాలుగు లైన్ల జాతీయ రహదారి పై గురువారం జామున నిద్రమత్తులో జాతీయ రహదారి పై నుంచి లారీ బోల్తాపడడంతో (Lorry accident) అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులలో నుంచి ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి నాందేడ్ కు బొగ్గులోడుతో వెళ్తున్న లారీ గురువారం తెల్లవారుజామున బోల్తాపడడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తుల్లో నుంచి షేక్ నీజార్ మృతి చెందగా ప్రహల్లాద్, రామకిషన్, షేక్ అహ్మదులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలైన వ్యక్తులను 108 ద్వారా రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

