ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు..
ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు..
- ఆలయం ఆవరణలో హోమం కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు..
- మహా అన్నదాన కార్యక్రమం,
చిట్యాల, ఆంధ్రప్రభ : గీతా కార్మికుల ఆరాధ దైవమైన, శ్రీ రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి, దేవాలయం, ఐదవ వార్షికోత్సవం ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో, గౌడ సంఘం కుటుంబ సభ్యులు, గ్రామదేవతలు, గణపతి పూజ, నిర్వహించి మహా యజ్ఞం కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు.
అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, మొదటిరోజు పూజార్ల వేదమంత్రోత్సవాల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమండ్ల రాజు, డైరెక్టర్లు, ఆముదాలపల్లి శ్రీనివాస్, గుర్రపు రాజు, బుర్ర నరేష్, బుర్ర రాజ్ కుమార్, గౌడ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

