చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ- అంతయ్య ఆధ్వర్యంలో
మొక్కలు నాటే కార్యక్రమం
చిట్యాల, ఆంధ్రప్రభ : వనమహోత్సవం–2026 కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా గురువారం చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ- అంతయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ ,ఏపిఓ అలీం , టి ఏ సుధాకర్ పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుర్ర వెంకటేశ్ గౌడ్, వార్డు సభ్యులు తౌటం నవీన్, మైదం శ్రావ్య శ్రీకాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, గ్రామపాలన సిబ్బంది, గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
