రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ పునర్నియామకం
రాజేష్‌పై మరోసారి నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వం
పెద్దపల్లి రూరల్: రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా జాపతి రాజేష్ పటేల్‌ను వరుసగా రెండోసారి నియమించారు. ఈ మేరకు రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జాపతి రాజేష్ పటేల్ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం తాను ఇప్పటివరకు చేసిన సేవలను గుర్తించి మరోసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, హిందూ ధర్మ పరిరక్షణ, సంస్థ బలోపేతం కోసం జిల్లావ్యాప్తంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.
