అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలి

అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలి
టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షు డు శ్రీనివాస్
నర్సంపేట, ఆంధ్రప్రభ : దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతను అన్ని విధాలుగా ఆదుకోవాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పంట దిగుబడికి సరిపోయే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఉదయం హమాలీలు కొరత,ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేక ,రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో విసిగి వేసారిన రైతులు దిక్కు తోచక ఎంతో కొంతకు ప్రైవేట్ వాళ్లకు తక్కువ ధరకు అమ్ముకుంటు న్నారని అంబటి శ్రీనివాస్ తెలిపారు. ఎండ, వడ గాలులు, వానలు రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ సిబ్బందిని పెంచి ట్రాన్స్పోర్ట్ ఎప్పటికప్పుడు జరిగేటట్టు చూడాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఒక ప్రక్క మక్కజొన్న రైతుల బాధలు పడుతుండగా మరోపక్కా వరి పంట కూడా వస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కోసమైనా అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు తెరవాలని, రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ ,కార్యదర్శి వెలిశాల రాజేష్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్ బోనగాని రవీందర్, జిల్లా నాయకులు గుంటి సంజీవ ఎండి సంధాని సోల్తి సాయి కుమార్ రాజు పాల్గొన్నారు.
