Rs 3,054cr : అందరూ ‘సిద్ధం Andhra Prabha Top News

Rs 3,054cr : అందరూ ‘సిద్ధం Andhra Prabha Top News

  • అఖండ గోదావరి అభివృద్ధే లక్ష్యం
  • రూ.3,054 కోట్లతో 2,800 పనులు
  • మున్నిపాలిటీలో ₹1,974 కోట్లతో ఋ,660 పనులు
  • పంచాయతీరాజ్​ లో ₹ 1,080 కోట్లతో 1149 పనులు
  • గుండాలలో తొలిఘాట్​
  • నర్సాపురంలో చివరి ఘాట్​
  • మొత్తం 525 ఘాట్లు సిద్ధం
  • రాజమహేంద్ర వరం మెగాసిటీ
  • ఈ సారి 10 కోట్ల పుణ్యస్నానాలు అంచనా
  • అఖండ గోదావరి అభివృధి ప్రాజెక్టు సమీక్ష

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​

Rs 3,054cr

అఖండ గోదావరి అభివృద్ధి లక్ష్యంతో.. గోదావరి పుష్కర పనులు జరగాలని, ఈ పనులన్నీ గోదావరి పరివాహిక ఆస్తిగా మారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి పుఫ్కరాల నేపథ్యంలో.. సచివాలయంలో మంగళవారం అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం సీబీఎన్​ సమీక్ష నిర్వహించారు.

Rs 3,054cr

ఈ సమీక్షలో మంత్రుల కమిటీ సహా వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా ముఖ్యమంత్రి చర్చించారు. దాదాపు రూ.3,054 కోట్లతో 2800 అభివృద్ధి పనులకు అంచనా వేశారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.1,080 కోట్ల విలువైన 1140 పనులు. చేపట్టాలని నిర్శయం తీసుకున్నారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

Rs 3,054cr Rs 3,054cr

అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సమీక్షలో వెల్లడించిన సీఎం
ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలన్న ముఖ్యమంత్రి పుష్కరాల నిర్వహణతో పాటు రాజమహేంద్రవరం లాంటి నగరం ఓ మెగాసిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని సూచనలు

Rs 3,054cr : ఈ పనులన్నీ గోదావరి ఆస్తే

Rs 3,054cr

కేవలం పుష్కరాలకు మాత్రమే పనులు పరిమితం చేయకుండా ప్రస్తుతం కల్పిస్తోన్న మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలని, సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తోన్న గోదావరి నది. పోలవరం జిల్లా గుండాలలో మొదటి పుష్కర ఘాట్. కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురంలో చివరి ఘాట్‌ నిర్మించాలని ప్రతిపాదన చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 288 ఘాట్లతో సహా కొత్తగా 237 ఘాట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Rs 3,054cr : 10 కోట్ల మంది రావొచ్చు

ఈసారి పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం 9 నుంచి 10 కోట్లమంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కర ఘాట్లు, రహదారులు, టెంట్లు, మరుగుదొడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1991లో 1.2 కోట్ల మంది భక్తుల పుష్కరస్నానాలు. 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

Rs 3,054cr : ఒకే రోజు కోటి స్నానాలు

గత పుష్కరాల్లో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తుల పుష్కర స్నానం చేయగా, ఈసారి ఒక్కరోజులో 1 కోటి మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర పొడవైన పుష్కర ఘాట్లు. కొత్తగా నిర్మించే వాటితో కలిపి ఘాట్‌ల పొడవు 9.9 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా తూర్పుగోదావరి , కోనసీమ జిల్లాల్లో 150కి పైగా పుష్కర ఘాట్ ల నిర్మిస్తారు. ఇప్పటికే రూ.211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, శానిటేషన్, తాగునీరు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుసూచించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ,
హోం మంత్రి అనిత, మంత్రి నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. సీఎస్ జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, దేవాదాయ, వైద్యారోగ్యం, రవాణా, పర్యాటక, పురపాలక, పంచాయితీరాజ్, ఆర్ధిక, జలవనరులు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ALSO READ : 01-Cm-Cbn-Slams : ఇది దుర్మార్గంతో యుద్ధం Andhra Prabha Top News

Leave a Reply