అంగన్వాడీ పిల్లలతో పోషణ అభియాన్ కార్యక్రమం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పిల్లల కోసం పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మనోహర మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.