కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో పావనికి సన్మానం
సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తానన్న ఎంపీడీవో
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పావనిని ఓఎంఐఎఫ్ సంస్థ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఎస్. హజమ్మ, మండల కోఆర్డినేటర్ నర్సింలు, సామాజిక కార్యకర్త కె. నారాయణ, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
