Problems | గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

Problems | గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
Problems | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. రహదారి, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, వ్యాపారాలను మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తాము ఉపాధి కోల్పోతామని కొందరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. పోలీసుల సాయంతో వారిని అడ్డుకొని ఆక్రమణలను తొలగిస్తున్నారు.
