టాక్సీ ఓనర్ అసోసియేషన్ సభ్యుల సమావేశం.

టాక్సీ ఓనర్ అసోసియేషన్ సభ్యుల సమావేశం.
విజయవాడసెంట్రల్, ఆంధ్రప్రభ :దివిజయవాడ టాక్సీ ఓనర్ అసోసియేషన్ సభ్యుల సమావేశం గవర్నర్పేట కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పలు విషయాలపై సమూలంగా చర్చించారు.ఇటీవల కాలంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగాయి.
తద్వారా వాహనాల రాకపోకలపై పెద్ద ఎత్తున భారం పడింది.దీనిపై అసోసియేషన్ సభ్యులు ప్రజలపై అధిక భారాలు వేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.పలువురు టాక్సీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను అసోసియేషన్ సభ్యులకి వివరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
