కలెక్టరేట్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
కలెక్టరేట్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి పోతురాజు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
