మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి..

మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి..

యువకుడు హత్య..
పోలీసుల చాకచక్యంతో నిందితుల పట్టివేత

పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటలలోపే ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.బుధవారం స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏడిసీపీ క్రైమ్ జి. రామకృష్ణ అరెస్ట్ అయిన నిందితులని వెల్లడించారు.సింగ్ నగర్ న్యూరాజరాజేశ్వరి పేటలో నివసిస్తున్న
1.పంది ప్రసాద్(24)

2. మిండల ఏసు అలియాస్ చిన్న కొత్తెం( 30)
3.విధ్యధరపురం ,గొర్రెల దొడ్డి వద్ద నివసించే గద్దల ప్రశాంత్ కుమర్ (39), ప్రస్తుతం రామనగర్ కాలనీ, సింగ్ నగర్, నివాసం ఉంటున్న మృతుడు మీసాల కుమార్ అలియాస్ గంజి కుమార్ అలియాస్ కృపారావు (36). మృతుడికి ఐదు సంవత్సరాల క్రితం మౌనికతో వివాహం కాగా, వారికి సంతానం లేదు. మృతుడు మద్యపానానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.ఈ క్రమంలో ఈనెల 11తేదీన భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయిన మృతుడు, న్యూ ఆర్ఆర్ పేటలోని కేజీ. ఎఫ్ అపార్ట్మెంట్స్ తన స్నేహితుడు పంది ప్రసాద్ వద్దకు వచ్చి ఉన్నాడు.

ఈనెల12వ తేదీ సాయంత్రం సమయంలో పంది ప్రసాద్ తల్లి గురించి మృతుడు అనుచితంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న పంది ప్రసాద్, అదే రోజు రాత్రి మద్యం మత్తులో మృతుడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో నిందితుడు పంది ప్రసాద్ న్యూ ఆర్ఆర్ పేటలోని ఆర్.ఆర్.III-15 బ్లాక్ వద్ద మృతుడితో గొడవపడి, నాపరాయితో తలపై బలంగా కొట్టగా మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుదూ అక్కడి నుండి తన ఆటో లో పరారయ్యాడు. తరువాత వైస్సార్ జక్కంపూడి కాలనీ నందు ఉంటున్న మిండల ఏసు అలియాస్ చిన్న కొత్తెం ఇంటి వద్దకు వెళ్ళి,వెంటనే అక్కడే ఉంటున్న మిండల ఏసు అలియాస్ చిన్న కొత్తెం, గద్దల ప్రశాంత్ కుమార్కు జరిగిన విషయం చెప్పినాడు. దానితో వీరు ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారం నిందితుడు పంది ప్రసాద్ వేసుకొన్న రక్తపు మరకలు కలిగిన బట్టలను విప్పించి మీందాల యేసు బట్టలు నిందితునికి ఇచ్చి తన రక్తపు మరకలు కలిగిన బట్టలను ఒక సంచిలో ఎవరికి తెలియకుండా దాచేసినారు. అనంతరం ఆటోలో ఉన్న రక్తపుమారకలను నీళ్ళతో ముగ్గురూ కలిసి కడిగేశారు.

ఈ విషయమై సమాచారం అందుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ జి.రామకృష్ణ మరియు నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ పి.సత్యానందం పర్యవేక్షణలో, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ డి.చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను రాత్రికి రాత్రే గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.

దర్యాప్తులో నిందితుడు పంది ప్రసాద్, మధ్యాహ్నం జరిగిన గొడవను మనసులో పెట్టుకొని మద్యం మత్తులో క్షణికావేశానికిలోనై తన సహచరులతో కలిసి మృతుడిని హత్య చేసినట్లు వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పంపించగా, నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.