గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 7వ తేదీన నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రామ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాముల అవ్వాలని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply