717liquor shops | మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం అభినందనీయం

717liquor shops | మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం అభినందనీయం

717liquor shops | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఒక నటుడిగా తనకు గర్వకారణమని పేర్కొన్నారు. అయితే విజయ్‌ను ఇప్పుడు కేవలం నటుడిగా కాకుండా రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడిగా చూడాలన్నారు.

విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై ప్రజల అంచనాలు మరింత పెరిగాయని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలనలో విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో నడుస్తున్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కమల్ హాసన్ అభినందించారు. ఈ చర్యను నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన కమల్, తాజా నిర్ణయంపైనా సానుకూలంగా స్పందించారు.

Leave a Reply