నేతలకు దక్కిన జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులు…!

నేతలకు దక్కిన జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులు…!

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫీషియో మెంబర్ గా “లావు”…
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా “కన్నా”….
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా “కొమ్మాలపాటి”….
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా “మల్లి”…
రాష్ట్ర కార్యదర్శిగా మరో ముగ్గురు….

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించిన జాతీయ రాష్ట్రస్థాయి పార్టీ పదవులను ప్రకటించారు. ఈ పదవుల పంపకాలలో పల్నాడు జిల్లాకు అగ్ర తాంబూలం లభించిందనే చెప్పాలి. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ జాబితాలో పల్నాడు జిల్లా నుండి దాదాపు 8 మందికి జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పోలిట్ బ్యూరోఎక్స్ అఫీషియో మెంబర్ గా నియమిస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మరో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును జోనల్ కో-ఆర్డినేటర్ గా, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నెం శివ నాగ మల్లేశ్వరరావును నియమిస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అంతేకాకుండా మద్దిరాల గంగాధర్ (పెదకూరపాడు), షేక్ కరిముల్లా (చిలకలూరిపేట), సిహెచ్ షమీంఖాన్ (వినుకొండ) లను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ సందర్భంగా వారు తమ నియామకానికి కృషిచేసిన జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Leave a Reply