కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు

కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు

వేంసూరు,ఆంధ్రప్రభ: చౌడవరం గ్రామంలో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. పంట కొనుగోలు చేసేందుకు కావలసిన సామాగ్రి గ్రామానికి చేరుకుంది. ఇప్పటికే మండలం లోని పలు గ్రామాలలో ఐకేపీ , సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభ తేదీని ప్రకటించడం అప్పటికి ముఖ్యమైన పని కారణంగా ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు వాయిదా వేసిన విషయం విధితమే. కొనుగోలు కేంద్రానికి కావలసిన పూర్తి సామాగ్రి గ్రామానికి చేరుకోవటంతో ఒకటి రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రామంలో సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా గ్రామ సమైక్య బలోపేతంలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెండు, మూడు రోజులలో ప్రారంభించనున్నట్లు ఐకెపి ఏపీఎం సుబ్బారావు తెలిపారు.

Leave a Reply