బాధితులకు సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

పార్టీలకు అతీతంగా ప్రజారోగ్య రక్షణకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రజారోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో 50 మంది లబ్ధిదారులకు రూ.17.85 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతిపక్ష నాయకుడు విష్షు నాయక్‌కు రూ.1,34,346 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో విభజించి సంక్షేమ పథకాల అమలును దెబ్బతీసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి వైద్య సహాయం, సంక్షేమ పథకాలు అందించేలా కట్టుబడి పనిచేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, అమరా రమాదేవి, వివిధ హోదాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.