వెలగపూడి |జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది… మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసు తదితరులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యత తీసుకొన్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమం లో జన సేన నేతలతో పాటు పలువురు టీడీపీ, బిజెపి నాయకులు కూడా పాల్గొననున్నారు.
MLC Elections| మరి కొద్దిసేపట్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్
