నందికొట్కూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వండి

నందికొట్కూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వండి

పాడైన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు నిధుల కేటాయింపు కోరిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పూర్తిగా దెబ్బతిన్న రహదారుల నిర్మాణం, మరమ్మతులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు.

ఆదివారం బనగానపల్లెలోని మంత్రి స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని ప్రధాన అభివృద్ధి అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలో పూర్తిగా పాడైపోయిన రహదారుల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించినట్లు గిత్త జయసూర్య తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రితో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

ఈ అంశాలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ భేటీలో పిక్కిలి శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply