జీవశాస్త్రంపై ఉపాధ్యాయులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి
డాక్టర్ సౌమ్య
వికారాబాద్, ఆంధ్రప్రభ : జీవశాస్త్రంపై ఉపాధ్యాయులు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించగలరని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సౌమ్య అన్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుల కోసం అనంతగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులకు సులభంగా, సమగ్రంగా బోధించవచ్చని తెలిపారు. మారుతున్న శాస్త్ర, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచించారు.
వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, దారూర్, నవాబ్‌పేట్, బంట్వారం, కోటిపల్లి మండలాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
