అచ్చంపేట పబ్లిక్ క్లబ్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

అచ్చంపేట పబ్లిక్ క్లబ్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

అచ్చంపేట, ఆంధ్రప్రభ:

అచ్చంపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా కన్నోజ్ మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్), కోశాధికారిగా పోకల ప్రవీణ్ విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా కందికొండ శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా ఎండి ఫహీం ఎన్నికయ్యారు.

మొత్తం 236 మంది సభ్యులకు గాను 217 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యుల మద్దతుతో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులకు క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి మాట్లాడుతూ, క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యులందరినీ కలుపుకొని పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల నిర్వాహకులు వెల్లడించారు

Leave a Reply