ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు..

ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు..
సస్పెన్షన్ కు రంగం సిద్ధమా?..
విధులకు హాజరుకాని ముగ్గురు సిబ్బంది..
ఒకరి సంతకాలు మరొకరు ఫోర్జరీ..
జిల్లా కలెక్టర్ ఆగ్రహం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది పని తీరుపై ప్రజలు రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు పలు ఫిర్యాదులు చేశారు. దీంతో బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లాలోని మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్రంగా ఆరా తీసిన కలెక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10:10 గంటల వరకు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాలేదని గుర్తించారు. విధులకు హాజరుకాని ముగ్గురు సిబ్బంది తరఫున ఎం పి హెచ ఓ ద్వారా మూమెంట్ రిజిస్టర్‌లో ఒకరి సంతకాలు మరొకరు చేయడం ఫోర్జరీ సంతకాలు చేయడం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనను జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించరు. సంబంధిత ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అక్కడున్నటువంటి అధికారులకు సూచించారు.

