వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…
వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తి
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ హరినాథరెడ్డి బుధవారం నందికొట్కూరు పట్టణంలోని శ్రీ కాళీ ప్రసాద ఆశ్రిత ఆశ్రమంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులను మాట మంతి గా పలకరించారు. ఈ సందర్భంగా 100 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలని పలకరించి ఆమె ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులతో కలిసి ఉదయం అల్పాహారం హైకోర్టు జడ్జి హరినాధ రెడ్డి భుజించారు.
వృద్ధాశ్రమంలోని సందర్శకుల రిజిస్టర్ నందు తన అమూల్యమైన సందేశాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆశ్రమాన్ని సందర్శించడంతో నా మనసులో ఎంతో ప్రశాంతత ఉందన్నారు. వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తి ఎన్ హరినాద్ రెడ్డి పల్లె ప్రియాంక సేవా సమితి అధ్యక్షులు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి పల్లె మోహన్ రావు ఆహ్వానం మేరకు వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తి వెంట స్థానిక సివిల్ సీనియర్ న్యాయమూర్తి శోభారాణి, జువాజీ సుంకన్న గౌడ్ సేవా సమితి, సన్మార్ సేవా సంస్థ విభిన్న ప్రతిభావంతులు నాగన్న, ఎల్ నరసింహారెడ్డి ధర్మారెడ్డి, శివరాముడు, శోభారాణి, 19 83 పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు శ్రీ రామ థియేటర్ యజమాని రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, జార్జ్ ఆశ్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
