Movie Release | జన నాయగన్ లైన్ క్లియర్..
Movie Release | జన నాయగన్ లైన్ క్లియర్..
Movie Release | జన నాయగన్ డేట్ పిక్స్ అయ్యిందా..?
సీఎంగా ఫస్ట్ బర్త్ డే..
విజయ్ ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్
జూన్ 22పై కోలీవుడ్ ఫోకస్
Movie Release | ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు.
సెన్సార్ కష్టాలు రావడం వలన ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు విజయ్ సీఎం అవ్వడం వలన ఈ సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయితే.. ఇంత వరుకు ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు జన నాయగన్ కి లైన్ క్లియర్ అయ్యిందని.. ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. జన నాయగన్ వచ్చేది ఎప్పుడు..? డబుల్ ట్రీట్ ఏంటి..?
Movie Release | జన నాయగన్ డేట్ పిక్స్ అయ్యిందా..?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈపాటికే ఈ సినిమా విడుదల కావాల్సివుంది. అయితే.. ఇప్పుడు సరైన డేట్ కోసం చూస్తున్నారట. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. జూన్ 22న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే రోజు విజయ్ పుట్టినరోజు కావడంతో.. ఆరోజు విడుదల చేస్తే.. సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని.. రికార్డు కలెక్షన్స్ వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారట మేకర్స్. త్వరలోనే జన నాయగన్ విడుదల పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.
Movie Release | సీఎంగా ఫస్ట్ బర్త్ డే..
సీఎం అయిన తర్వాత విజయ్ జరుపుకోనున్న తొలి పుట్టినరోజు కావడంతో ఈసారి వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. జన నాయగన్ మూవీ నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా టీజర్ లేదా స్పెషల్ వీడియో విడుదల చేసే అవకాశముందని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు జన నాయగన్ గురించి రకరకాల పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ భారీగా చేసేందుకు సిద్ధమవుతున్నారు. #JanaNayagan, #HappyBirthdayVijay హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా అప్ డేట్‌తో పాటు రాజకీయంగా కూడా విజయ్ నుంచి ఏదైనా కీలక సందేశం ఉండొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన నాయగన్ జూన్ 22న థియేటర్లోకి వస్తే.. డబుల్ ట్రీటే.. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
CLICK HERE TO READ Megastar | చిరు లీక్స్ లో మెగా 158 టైటిల్..
