Megastar | చిరు లీక్స్ లో మెగా 158 టైటిల్..

Megastar | చిరు లీక్స్ లో మెగా 158 టైటిల్..
Megastar | రెగ్యులర్ షూట్ లో మెగా 158..
పవర్ ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్లో చిరంజీవి
టైటిల్ పై చిరు సరదా లీక్స్
కాకా.. కాకాజీ.. ఏది ఫైనల్ టైటిల్..?
Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో రూపొందే సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇంతకీ.. ఈ మూవీ టైటిల్ ఏంటి..? దీని గురించి చిరు ఏమన్నారు..?
Megastar | రెగ్యులర్ షూట్ లో మెగా 158..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మేకర్స్ ప్రకటించినట్లుగానే హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌ల పై కీలక టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు. వీడియోలో ఉత్సాహంగా కనిపించిన చిరంజీవి, “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్” అంటూ సందడి చేశారు.

Megastar | పవర్ ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్లో..
అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగగా, ఆయన దాటవేయడానికి ప్రయత్నించారు. దానికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ, “సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో” అంటూ చమత్కరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. అలాగే అనస్వర రాజన్ కూడా మెగాస్టార్‌తో కలిసి నటించబోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Megastar | చిరు లీక్స్ లో టైటిల్..
ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. అయితే.. ఈ మూవీ టైటిల్ ను చిరు లీక్ చేస్తాను అనడం విశేషం. ఇదిలా ఉంటే.. కాకా, కాకాజీ అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి.. ఈ టైటిల్స్ లో ఒక టైటిల్ ని ఫైనల్ చేస్తారో.. లేక ఈ రెండు కాకుండా మరో టైటిల్ ఫిక్స్ చేస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

