MLA Venigandla | సమస్యల పరిష్కారం దిశగా..

MLA Venigandla | సమస్యల పరిష్కారం దిశగా..
- ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- బిల్లపాడులో రూ.1.20 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
MLA Venigandla | గుడివాడ, ఆంధ్రప్రభ : కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రూ.1.20 కోట్ల నాబార్డు నిధులతో గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు బిల్లపాడు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన ప్రతి చోట రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నిరాధారణకు గురవుతున్న మారుమూల ప్రాంతాల సమస్యలను సైతం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘానికి, పంచాయతీకి కాకుండా పోయిన మందపాడు న్యూ కాలనీను ప్రజల సౌకర్యార్థం బిల్లపాడు పంచాయతీలో కలుపుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
గత రెండు దశాబ్దాలుగా రోడ్ల ముఖం చూడని అనేక ప్రాంతాల్లో కూటమి పాలనలో రహదారులు వేస్తున్నామన్నారు. గత పాలకులు గ్రామాల్లో గుప్పెడు మట్టి పోసిన పాపాన పోలేదని, కూటమి పాలనలో ప్రజలకు త్రాగు సాగునీరు అందించడమే కాకుండా, అనేక ప్రాంతాల్లో రహదారుల సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు గోరిపర్తి సుబ్బారావు, రేమల్లి రజనీకాంత్,MPDO విష్ణు ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ అనంతలక్ష్మి, ప్రాజెక్టు డీఈ మోసెస్, ఏఈ పూజిత్ ఫణి వెంకట్,బిల్లపాడు గ్రామ నాయకులు కర్రే వెంకటగిరి, నిమ్మగడ్డ నాగ శాస్త్రి, వీర నాంచారయ్య, రామస్వామి శాస్త్రి, రాంపండు, గొర్రెపత్తి నాగేశ్వరరావు, మెండు రమేష్, తాళ్లూరి డాల్ఫిన్, మరీదు విజేంద్ర, వేములపల్లి భవాని, కల్లేపల్లి నాగరాజు, అశోక్, నాంచారమ్మ, పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
