CM Nara Chandrababu | సీఎంకు ఘన స్వాగతం

CM Nara Chandrababu | పోలవరం/ఉమ్మడి పశ్చిమ బ్యూరో, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా బుధవారం హెలికాఫ్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం నారా చంద్రబాబునాయుడుకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి లు పుష్పగుచ్చాలతో ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే లు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, పితాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి, డా.కామినేని శ్రీనివాస్, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజీ జి.వి.జి.అశోక్ కుమార్, ఆర్ & ఆర్ ప్యాకేజీ కమిషనరు పి.ప్రశాంతి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఏపి భవన నిర్మాణ కార్మిక, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణలు ముఖ్యమంత్రికి పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటరు & ఎక్స్ అఫీషియో జాయింటు కలెక్టరు వి.అభిషేక్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఆర్డీఓలు యం.అచ్యుత అంబరీష్, యం.వి.రమణ, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణిశివ ప్రసాదు, జిల్లా పరిషత్ సీఈఓ యం.శ్రీహరి, ప్రభృతులు ఉన్నారు.
