భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ పుష్పగుచ్ఛం అందజేసి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకున్నారు.

ప్రజా సేవలో భట్టి విక్రమార్క మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.