TG | అంతరాష్ట్ర ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన

TG | అంతరాష్ట్ర ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన

  • శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన పోటీలను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

TG

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఒంగోలు జాతి పశువులు తెలుగు రైతులకు గర్వకారణమని, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతి పరిరక్షణకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు. రైతులు పశుపోషణను వృత్తిగా అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని పేర్కొన్నారు.

TG

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులోనూ రైతులు, పశుపోషకులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి కర్ణాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, పశుపోషకులు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply