Makthal | నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ప్రారంభం

Makthal | నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ప్రారంభం
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలకు అంతా సన్నద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కానీ ఎన్నికల ప్రచారం మాత్రం అప్పుడే మొదలు పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోళ్ళ సంధ్య వెంకటేష్ బరిలో ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ రోజు మంచిరోజు కావడంతో మక్తల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ తమ వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ ప్రతి ఓటరు పలకరిస్తూ వార్డు అభివృద్ధికై తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో తన భర్త ఎంపీటీసీగా తన తోటి కోడలు ఎంపీపీగా మక్తల్ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా ఆమె ఓటర్లను అభ్యర్థించారు.
స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తమ కుటుంబం పనిచేస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అధికార పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇతరులను నమ్మి మోసపోవద్దని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించవలసిందిగా కోళ్ళ సంధ్య వెంకటేష్ ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ కోళ్ళ వెంకటేష్, నాయకులు సర్పరాజ్, తిరుపతి నరసింహులు, మామిళ్ళకిష్టప్ప, కావలి అంజప్ప మైనార్టీ నాయకులు గేసుదరాజ్, షర్ఫుద్దీన్, షేక్ అహ్మద్, ఇంతియాస్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
