ఇందిరమ్మ ఇల్లు ఘన ప్రారంభం

ఇందిరమ్మ ఇల్లు ఘన ప్రారంభం
- పేదింటి సొంత ఇంటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : పేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం చేస్తూ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు శనివారం ఘనంగా ప్రారంభమైంది. నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఆడిచర్ల మౌనిక–శ్రీనివాస్ దంపతులకు ఈ ఇల్లు కేటాయించగా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి కలిసి గృహాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు గృహ సదుపాయం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇఫ్తార్ శేఖర్ గౌడ్, మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కుంచాల రాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి సుమన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్ పాల్గొన్నారు. అలాగే సిద్ధ సంతోష్, సర్వేశం, దండెం రవీందర్, చిందం కుమారస్వామి, మామిడి కృష్ణ, తిప్పని లింగమూర్తి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.
