పశువైద్యశాలలో నాగుపాము కలకలం…
పశువైద్యశాలలో నాగుపాము కలకలం…
- చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ సుమన్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఉప్పునుంతల మండల కేంద్రంలోని పశువైద్యశాలలోకి శనివారం నాగుపాము ప్రవేశించడం కలకలం రేపింది. అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించారు.
ఈ ఘటనను గమనించిన జూనియర్ అసిస్టెంట్, ఉచితంగా స్నేక్ క్యాచర్‌గా సేవలు అందిస్తున్న సుమన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సుమన్ తక్షణమే ఘటనాస్థలికి చేరుకొని, చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. అనంతరం ఆ పామును సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, అన్ని పాములు విషపూరితమైనవి కావని, ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన ప్రాధాన్యం ఉందని తెలిపారు. అన్ని జీవులు సహజంగా జీవిస్తేనే మానవ మనుగడ కూడా సుస్థిరంగా ఉంటుందని అన్నారు. మనలాగే ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, కాబట్టి వన్యప్రాణులను ఎవరూ హానిచేయకూడదని సూచించారు.
ఎక్కడైనా పాములు కనిపిస్తే భయపడకుండా అటవీశాఖ అధికారులకు లేదా తనకు సమాచారం ఇస్తే వెంటనే చేరుకొని వాటిని సురక్షితంగా తరలిస్తామని సుమన్ పేర్కొన్నారు.
