67balls | రికార్డులు బద్దలు కొట్టిండురో..

67balls | రికార్డులు బద్దలు కొట్టిండురో..
67balls | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మొన్న జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్‌పై 152* (67 బంతులు) పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. నిన్న జరిగిన రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఈ ఆటగాడు మరో రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన మొదటి భారతీయ ఓపెనర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఓపెనర్‌గా ముగ్గురు మాత్రమే 200 సిక్స్‌లు కొట్టారు. అందులో కేఎల్ రాహుల్ మూడో ప్లేయర్. కానీ, తొలి భారత ఆటగాడు. అందరికంటే ఎక్కువగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 326 సిక్స్‌లు కొట్టాడు. అతడి తర్వాత సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ 210 సిక్స్‌లు బాదాడు.
