అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌పై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌పై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
- 25 నుంచి మెగా సర్జికల్ క్యాంప్ విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో నిర్వహించనున్న నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపును విజయవంతం చేయాలని డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి సూచించారు.

క్యాంపులో శస్త్రచికిత్సలు పొందే రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లమల్ల, అచ్చంపేట పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఈ మెగా సర్జికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తారాసింగ్, డాక్టర్ మహేష్, ప్రతిప్ రాజ్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
