ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: తపస్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తపస్ జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా సమన్వయకర్త నర్సింగప్ప, మండల అధ్యక్షులు కుంటిమారి కృష్ణఅన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై తాసిల్దార్ అశోక్ కుమార్, కు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పెండింగ్ డిఏలు, పిఆర్సి ప్రకటిస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు నిమ్మకు నేరెత్తినట్టుగా ఉండడం, వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులలో అసహనం పెరిగిందని అన్నారు.
ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలను ఈ నెల చివరి వరకు వారి అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి 51 శాతం పి.ఆర్.సి అమలు చేస్తూ, వెంటనే 6 డి ఏ లు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, టీచింగ్ నాన్-టీచింగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, సీపీస్ రద్దు చేసి ఒపీస్ అమలు, ఎస్ఎస్ ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఎం టి ఎస్ వ్యవస్థ అమలు, ఇతర ఉపాధ్యాయ-ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ మండల కార్యదర్శి గోపాల్, గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, కోశాధికా రమేష్, తపస్ జిల్లా నాయకులు కిరణ్, తిరుపతి నాయక్, వెంకటేష్ గనప, మండల నాయకులు బనేష్, పారిజాత, స్వప్న, అంజమ్మ, శిరీష, సుభాని, ఫజలూరి రహమాన్, అశోక్ ,వసుంధర, ధనుంజయ, కేశవులు, రజిత, మహేందర్ , నరసింహ, పృథ్వీరాజ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
