అగ్నిమాపక సేవల వారోత్సవ ముగింపు కార్యక్రమం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మీ భద్రయ్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక సేవల వారోత్సవం విజయవంతంగా ముగిసింది. ఈ వారోత్సవం ప్రధాన ఉద్దేశ్యం అగ్ని ప్రమాదాల నివారణ, అప్రమత్తత మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

సోమవారం రోజు పట్టణంలోని ఫైర్ కార్యాలయంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సంతోష్ నర్సింగ్ హోమ్ ప్రముఖ డాక్టర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల సమయంలో సమయానికి స్పందించడం, ప్రాథమిక చికిత్స (ఫస్ట్ ఎయిడ్ ) పై అవగాహన ఉండటం ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలకమని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply