ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు వి. ఎమ్.రంగా.

ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు వి. ఎమ్.రంగా.

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా.

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు వంగవీటి మోహన రంగా అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో శనివారం రాధా రంగా మిత్ర మండలి సభ్యులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని ఎన్నో అడ్డంకులు దాటుకుని పాత బస్ స్టాండ్ ప్రక్కన గల పార్కులో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.

ఐతే రంగా విగ్రహం ఏర్పాటు, ఆ యొక్క కూడలికి రంగా జంక్షన్ అని నామకరణం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన బొండా ఉమాకు రాధా రంగామిత్ర మండలి అధ్యక్షులు,సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.బడుగు బలహీన వర్గాలకు అండగా రంగా పనిచేశారని వారు గుర్తు చేసుకొన్నారు.ఈ కార్యక్రమంలో మామిత్ర మండలి నేతలు చింతల రామారావు (బాబీ ), చింతల రవికుమార్ (చంటి ) రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్, యువ నాయకుడు బొండా సిద్దార్ధ, అడబాల కృష్ణజి, అడబాల బాల, నవనీతం సాంబశివరావు,గరిమెళ్ళ చిన్నా, బత్తుల కొండా, పైడి శ్రీను, ఆకుల సూర్యప్రకాష్, బుదాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply