మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం
భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడలోని కేఎల్‌రావు నగర్‌కు చెందిన పిళ్లా దుర్గా ప్రవీణ్ (29) ఇటీవల బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందగా, ఆయన కుటుంబానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు గురువారం ఆర్థిక సాయం అందించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గా ప్రవీణ్ మృతి చెందిన విషయం సుజన మిత్ర, ఎన్డీయే కూటమి నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
దీంతో సుజన మిత్ర కోఆర్డినేటర్, కూటమి నాయకులు కలిసి మృతుడి తల్లి పిళ్లా భారతికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా ఎన్డీయే కూటమి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వేంపలి గౌరీశంకర్, ప్రభుచరణ్, కోటేశ్వరరావు, గడ్డం సాంబ తదితరులు పాల్గొన్నారు.
