పుట్టపర్తిలో మంత్రుల సందడి

పుట్టపర్తిలో మంత్రుల సందడి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Bhagawan Sri Sathya Sai Baba) శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని… పుట్టపర్తిలో చేపట్టిన పనుల పరిశీలన నిమిత్తం.. మంగళవారం ఉదయం పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రవాణా ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి కృష్ణబాబు, పర్యాటక యువజన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చేరుకున్నారు. విమానాశ్రయం (Airport) లో రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.
జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసి మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర అధికారులున్నారు. విమానాశ్రయం నుంచి రాష్ట్ర మంత్రుల బృందం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పుట్టపర్తిలోని ఆశ్రమం చేరుకొని.. సాయి కుల్వంత్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
