AP | దంపతులకు తీవ్ర గాయాలు..

AP | దంపతులకు తీవ్ర గాయాలు..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా సూరంపల్లిలోని ఓ ఇంట్లో ఇవాళ తెల్లవారుజామున కూలర్ పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రావడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా కాలిపోయారు. బాధితులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.

తీవ్ర గాయాలతో ఉన్న దంపతులను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి శరీర భాగాలు కాలిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కూలర్ పేలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply